22-11-2025 12:00:00 AM
భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
చైతన్యపురి పరిధి మార్గదర్శి కాలనీలో విషాదం
ఎల్బీనగర్, నవంబర్ 21 : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ దంపతుల ఆత్మహత్యా యత్నం కలకలం రేపుతోంది. నాగోల్ - బండ్లగూడ తట్టిఅన్నారం అటవీ ప్రాంతంలో దంపతుల ఆత్మహత్య యత్నం చేయగా, భార్య మృతి, భర్త పరిస్థితి విషమం ఉందని పోలీసులు తెలిపారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్గదర్శి కాలనీలో ఉంటున్న గడ్డమిది మల్లేశ్ (45), సంతోషి (37) దంపతులు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు.
వీరికి కుమారుడు శివ(20), ఇద్దరు కుమార్తెలు మేఘన (17), మౌనిక (15 సంవత్సరాలు) ఉన్నారు. అయితే, మల్లేశ్, సంతోష్ దంపతులు శుక్రవారం ఉదయం వాక్సింగ్ కు వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుమారుడు తండ్రికి ఫోన్‌కు చేయగా స్పందించలేదు. కాగా, వాట్సాప్ కు తండ్రి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఎస్ బీఐ బ్యాంక్ నుంచి రూ, 20 లక్షలు చొప్పున మొత్తం రూ, 40 లక్షలు వస్తాయని సమాచారం ఇచ్చి, తర్వాత ఫోన్ స్వి ఆఫ్ వచ్చింది.
ఈ మేరకు కుమారుడు చైతన్యపురి, నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దుపై చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నాగోల్ - బండ్లగూడ పరిధిలోని తట్టి అన్నా రంలో ఉన్న నిర్మానుష ప్రదేశంలో దంప తులు పురుగుమందు సేవించి ఆత్మ హత్యాయత్నం చేసినట్లు గుర్తించారు. అంబు లెన్స్ చేరుకునే సరికి సంతోషి అక్కడికక్కడే మృతి చెందగా, మల్లేశ్ విషమస్థితిలో ఉండటంతో వెంటనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు చైతన్యపురి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.