23-10-2025 11:35:12 AM
మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్,మాజీ జెడ్పిటిసి గొర్రెసాగర్.
కొత్తపేటలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ.
చిట్యాల(విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బాకీ కార్డుతో కాంగ్రెస్(Congress) పార్టీ భరతం పడతామని చిట్యాల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్,మాజీ జెడ్పిటిసి గొర్రసాగర్ అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కొత్తపేట గ్రామంలో కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలను చేసి విస్మరిచ్చిందన్నారు.
రైతాంగానికి సకాలంలో యూరియా అందించడం లేదని, వడ్లకు బోనస్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు,మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్,దొడ్డె శంకర్,లావుడ్యా రాజునాయక్,దారావత్ రాజునాయక్,గ్రామ శాఖ అధ్యక్షుదు తిరునహరి వెంకటేశ్వర్లు,ఉమ్మనబోయిన శంకర్, పాకాల వీరారెడ్డి,నల్ల దేవేందర్ రెడ్డీ,తీగల రాజు,చిగురు నరేష్,నునేటి సంతోష్,బాసాని ఓదెలు,దొడ్డి నాగార్జున, తోర్ని రాజు,చిగురు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.