calender_icon.png 11 August, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐడీబీఐ బ్యాంకు సహకారంతో పాఠశాలకు డెస్క్ బెంచీలు కంప్యూటర్ల వితరణ

06-08-2025 12:31:38 AM

కామారెడ్డి, ఆగస్టు 5 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ వాడ ఉన్నత పాఠశాలలో మంగళవారం  పాఠశాల విద్యార్థులకు ఐడిబిఐ బ్యాంక్ కామారెడ్డి శాఖ సి ఎస్ ఆర్ నిధులనుండి డెస్క్ బెంచీలు, కంప్యూటర్, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు బల్లలు, ఫ్యాన్లు అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  జిల్లా విద్యాశాఖ అధికారి రాజు హాజరై మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికై కృషిచేస్తున్న ఐడిబిఐ బ్యాంకు సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఐడిబిఐ హైదరాబాద్ రీజనల్ హెడ్  వెంకటేష్ మాట్లాడుతూ, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎల్లయ్య, ఐడిబిఐ ఏజీఎం శ్రీధర్, స్థానిక ఐడిబిఐ బ్యాంకు మేనేజర్ రాజు, సహాయ మేనేజర్  ప్రవీణ్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.