calender_icon.png 13 August, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ కళాశాలలో వసతుల లేమి ఉండదు

06-08-2025 12:33:01 AM

  1. హాస్టల్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం 

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు 

హుస్నాబాద్/నంగునూరు, ఆగస్టు 5: హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ శివారులోగల పాలిటెక్నిక్ కళాశాల మొదటి అంతస్తులో  కొనసాగుతున్న శాతవాహన ఇంజనీరింగ్ కళాశాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మొదటి విడత కౌన్సిలింగ్ లో 160 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని, డిపార్ట్మెంటాల్ అటాచ్డ్ హాస్టల్ సౌకర్యం లేని కారణంగా 2 వ విడత కౌన్సిలింగ్ లో  అడ్మిషన్ పొందలేరని నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. మొదటి సంవత్సరం అన్ని బ్రాంచ్ లలో 91 చొప్పున అడ్మిషన్ తీసుకున్నారని కాలేజ్ ప్రిన్సిపాల్ తెలిపారు. 3 వ విడత కౌన్సిలింగ్ లో ఇంజనీరింగ్ కళాశాల, డిపార్ట్మెంటాల్ అటాచ్డ్ హాస్టల్ లని పెడితే అడ్మిషన్ లు వస్తాయని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అడ్మిషన్స్ సంఖ్య పెంచాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని  సూచించారు. బాలుర, బాలికలకు వేరుగా తాత్కాలిక  హాస్టల్ వసతి కొరకు  అన్వేషణ చెయ్యాలని తహసిల్దార్ ను ఆదేశించారు. పాలిటెక్నిక్, ఇంజనీర్ కళాశాలల విద్యార్థులకు సరిపడా నీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ డిఈనీ ఆదేశించారు.

రోడ్ నుండి కళాశాల ప్రాంగణం వరకు సీసీ రోడ్ నిర్మాణానికి అవసరమైన నివేదిక రూపొందించాలని పంచాయతీ రాజ్ ఇంజనీర్ శాఖ అధికారులకు సూచించారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న చెట్ల పొదలు తొలగించి, శుభ్రం చేయించాలని డిపిఓ కి ఫోన్ ద్వారా తెలిపారు.

హుస్నాబాద్ పట్టణం నుండి కళాశాల వరకు ఉదయం, సాయంత్ర వేళల్లో బస్సు సౌకర్యం కల్పిస్తానని అడ్మిషన్ పొందిన విద్యార్థులకు చదువు, మౌలిక వసతులు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. కలెక్టర్ వెంట పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీదేవి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ. 300 కోట్లతో నిర్మిస్తున్న పరిశ్రమ వారం పది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం పై సమీక్షించిన కలెక్టర్ పనుల పురోగతిని పరిశీలించి, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఫ్యాక్టరీ రోజుకు 40 మెట్రిక్ టన్నుల ఆయిల్ పామ్ ను శుద్ధి చేయగల సామర్థ్యంతో నిర్మాణమవుతుంద న్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం చివరి దశలో ఉందని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.