06-08-2025 12:31:38 AM
కలెక్టర్ పి.ప్రావిణ్య
సంగారెడ్డి, ఆగస్టు 5 : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల మహిళా ప్రాంగణం సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య మంగళవారం సందర్శించి నిర్వహణ, సేవల నాణ్యతను పరిశీలించారు..డిఆర్డిఏ జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బంక్ను మహిళలే స్వయంగా నిర్వహిస్తుండడం చాలా గర్వకార ణమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కోటీశ్వరు లుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళల చేతిలో పెట్రోల్ బంక్ నిర్వహణ అన్నది మహిళా సాధికారతకు ఒక మైలురాయి అన్నారు. మహిళలు ఇప్పుడు ఉద్యోగాలకే పరిమిత మయ్యే స్థాయిలో కాకుండా ఉద్యోగాలను సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు.
మహిళల చేతుల్లో ఉన్న ఈ పెట్రోల్ బంకు ఒక ఆదర్శంగా నిలవాలని అన్నారు. వినియోగ దారులకు అనుకూలంగా స్టాక్ బోర్డు, సిటిజన్ చార్ట్, అత్యవసర నెంబర్లు స్పష్టంగా ప్రదర్శిం చాలని ఆదేశించారు.అమ్మకాలు పెంచుకునే విధంగా ప్రణాళికా బద్దంగా ముందుకెళ్లా లని సూచించారు.
లీగల్ మెట్రాలజీ శాఖ తరచుగా తనిఖీలు చేసి నాణ్యత, పరిమాణాలను నిర్ధారిం చడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డిఏ సూర్యారావు , ఏపిఎంలు, సంబంధిత అధికారులు, జిల్లా మహిళా సమైక్య ప్రతినిధులు, బంక్ సిబ్బంది పాల్గొన్నారు.