4 April, 2026 | 8:25 PM

విద్యార్థులకు డెస్క్ బెంచీల పంపిణీ

04-04-2026 06:48 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సౌకర్యం కోసం రాజిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి శనివారం మరో ముఖ్య సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భిక్కనూర్ మండలంలోని జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలలకు 200 నాణ్యమైన డ్యూయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. ఈ డెస్క్ బెంచీలు విద్యార్థులకు సౌకర్యవంతమైన, క్రమబద్ధమైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాధికారి రాజగంగారెడ్డి మాట్లాడుతూ... విద్యా రంగ అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పాఠశాల కమిటీ చైర్మన్‌లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సేవా కార్యక్రమాన్ని హర్షం వ్యక్తం చేస్తూ తమ కృతజ్ఞతలను తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.