4 April, 2026 | 8:26 PM

పాస్టర్స్ ర్యాలీ

04-04-2026 06:45 PM

దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాస్టర్స్ ఫెలోషిప్ శాంతియుత ర్యాలీలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి ఐక్యత చాలా అవసరమని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాస్టర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు, చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.