calender_icon.png 25 August, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఎప్పుడు..?: సిపిఎం నాయకులు

14-03-2025 12:34:33 AM

మందమర్రి,(విజయక్రాంతి): ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్లు ఇండ్లను పేదలకు ఎందుకు పంచడంలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే అర్హులకు పంపిణీ చేయక పోతే సిపిఎం ఆధ్వర్యంలో పేదలతో కలిసి, ఆ ఇండ్లలో గృహప్రవేశం నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి లు స్పష్టం చేశారు. సిపిఎం మండల నాయకులు గురువారం పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ ఇళ్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్లు నిర్మించగా పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో కోట్లాది రూపాయలతో 500 పైగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి, సర్వేల పేరుతో సంవత్సరాలు గడిపిన బిఆర్ఎస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కరికి సైతం ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పేదలకు పంచడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆరోపించారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించి, నేడు ఎవరికి ఇవ్వకపోవడంతో పిచ్చి మొక్కలతో, గోడలు బీటలు వారి, కిటికీల అద్దాలు పగిలి, పందులకు, కుక్కలకు ఆవాసాలుగా మారడమే కాకుండా, మందుబాకులకు పేకాట రాయులకు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఈ డబుల్ బెడ్రూం ఇల్లు అడ్డాగా మారుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన గౌరవాన్ని నిలుపుకునే విధంగా అర్హులైన పేదలందరికీ పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండాలతో ఇల్లు లేని నిరుపేదలందరితో గృహప్రవేశం చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్, ఎర్మ పున్నం, బొడెంకి చందు, జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, గోమాస అశోక్, దుంపల రంజిత్ కుమార్, సామల ఉమారాణి, దాగం శ్రీకాంత్, భాగ్య, నిర్మల లు పాల్గొన్నారు.