25-08-2025 07:43:29 PM
భూత్పూర్: జనావాసాల్లో కలుపు మొక్కలు నియంత్రణ, కలుపు మొక్కలను పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచుకోవాలని వనపర్తి ఎంజెపి అగ్రికల్చర్ గర్ల్స్ కాలేజ్(MJP Agriculture Girls College) వనపర్తి జిల్లా వ్యవసాయ కళాశాల కో ఆర్డినేటర్ డాక్టర్ టి. అర్చన అన్నారు. ఈ సందర్భంగా సోమవారం భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ గ్రామంలో కలుపు మొక్కపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలుపు మొక్కలు పెరగడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయని, కలుపు మొక్కలకు మందు కొట్టి పెరగకుండా చూసుకోవాలన్నారు. కలుపు మొక్కను నిర్మూలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మజ, సంధ్య, విద్య, నవ్య, రాజేశ్వరి తో పాటు తదితరులు ఉన్నారు.