calender_icon.png 25 August, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ శ్రేణులతో బాల్క సుమన్ సమీక్ష సమావేశం

25-08-2025 07:50:38 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): అప్పుడే మంచిగా ఉండే మా గ్రామం నుంచి పోరాటం అంటూ బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Former MLA Balka Sumanఓ వినూత్న కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. సోమవారం సుమన్ క్యాతనపల్లి తన నివాసంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నిక సన్నాహా సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ, గ్రామాల నుంచే మళ్లీ పోరాటం చేయవలసిన సమయం వచ్చిందని సుమన్ పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గత పదేళ్ల పాలనలో ప్రజలకోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ అప్పుడే మంచిగుండే అని బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులు లభించేవాని సుమన్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, ఆసరా పెన్షన్ కులవృత్తులకు చేయూత కార్యక్రమాలతో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెచ్చిన పథకాలు ప్రజలకు బాగా చేరువైంది రాష్ట్రం అప్పుడే మంచిగా ఉండే అంటూ అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువులు అందించామని గుర్తు చేశారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు అందించక పోవడమే కాకుండా ఎరువుల కోసం రైతులను ఎండ,వానల్లో పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు.బిఆర్ఎస్ హయాంలో సంపాదించుకున్న అభివృద్ధి, సంక్షేమం,ఆత్మగౌరవన్ని తిరిగి పొందాల్సిన అవసరం ఉందని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే వివేక్ ఎన్నిక సమయంలో నియోజక వర్గంలోని ముప్పు పొంచి ఉన్న పొలాలకు రక్షణగా గోదావరి,ప్రాణహిత నదులకు కరకట్టలు నిర్మిస్తామని రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో 20 నెలలుగా ఆ ఊసే మర్చిపోయారని దుయ్యబట్టారు.సింగరేణి ప్రాంత నిరుద్యోగులకు నలబై వేల ఉద్యోగులు ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని మండిపడ్డారు.రానున్న జడ్పీటీసీ, ఎంపిటిసి,సర్పంచ్ ల ఎన్నికల్లో తమదే పై చేయని,పార్టీ గెలుపుకు శ్రేణులు కృషి చేయాలని సుమన్ పిలుపునిచ్చారు.

పార్టీలో చేరికలు

నియోజకవర్గంలోని కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకుని బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి డా. రాజరమేష్,పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్,మందమర్రి పట్టణ అధ్యక్షుడు జె.రవీందర్,మాజీ జడ్పిటిసి వేల్పుల రవి, రామిడి కుమార్,అనిల్ రావు,ఓదేలు, మహేష్,విద్యార్థి విభాగ నాయకులు పాల్గొన్నారు.