25-08-2025 07:44:06 PM
నల్లచెరువుకి రెండు వైపుల మెయిన్ గేట్ల నిర్మాణం వద్దు
బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్
వనపర్తి టౌన్: వనపర్తి పట్టణ మున్సిపల్ అధికారులు నల్లచెరువుపై వాహనాల రాకపోకలు జరగకుండా రెండు వైపుల రోడ్డుకు అడ్డంగా గేట్ల నిర్మాణం చెయ్యడానికి ఇటీవల టెండర్లను పిలిచి,అట్టి పనిని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించడం జరిగిందని ఈ మెయిన్ గేట్లు లేకుంటేనే ట్యాంక్ బండ్ ఎంతో శోభాయమానంగా ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటీ శ్రీధర్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు ట్యాంక్ బండ్ కట్టను వెడల్పు చేసి, సుందరీకరణ చేసి, భారీ వాహనాలు వెళ్ళడానికి సిసి డబల్ రోడ్డుని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాయంలో వేయడం జరిగిందని దీనితో వనపర్తి పట్టణంలోని భారి ట్రాఫిక్ రద్దీ రిత్యా గోపాల్పేట్ - ఘణపురం వెళ్ళే రోడ్డుకు బైపాస్లో వెళ్ళడానికి ఇట్టి రోడ్డును డిజైన్ చేసి గత ప్రభుత్వం హాయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కాని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇట్టి రోడ్ పై భారి వాహనాలు వెళ్ళరాదంటూ నల్ల చెరువు 'ట్యాంకుబండ్ రోడ్డుకు అడ్డంగా గేట్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి మరమత్తుకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. వనపర్తి పట్టణంలో నల్ల చెరువుపై దారికి అడ్డంగా నిర్మించతలపెట్టిన గేట్ల నిర్మాణం జరగకుండా చూసి,అట్టి చర్యలను రద్దు చేసి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి పట్టణ బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.