calender_icon.png 25 August, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

25-08-2025 07:47:18 PM

నల్లగొండ వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి..

పాత నేరస్తులకు పోలీస్ స్టేషన్ లో  కౌన్సిలింగ్

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి, ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి(CI Ami Reddy Rajasekhar Reddy) పేర్కొన్నారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రౌడీ షీటర్లకి, పాత నేరస్తులకు కౌన్సెలింగ్, 2 లక్షల జరిమానాతో పాటు బైండోవర్ కేసులు చేస్తామన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి  సూచనల మేరకు  నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోమవారం  పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలు రకాల నేరాలు చేసి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్లు నమోదు చేయబడిన 20 మంది వ్యక్తులను, పాత నేరస్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించి  కౌన్సెలింగ్ నిర్వహించారు.

రౌడీ షీటర్ల కదలికలపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కేసులు నమోదు చేసి, పి.డి యాక్ట్ లు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. గత నేర ప్రవృత్తిని వదిలేసి సమాజ హితంగా బతకాలని సూచించారు. పట్టణంలో సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగేలా, సామాన్య ప్రజలను బెదిరించినట్లుగా ఎటువంటి సమాచారం తెలిసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సెక్టార్ ఎస్సైలు సతీష్, సైదులు, సిబ్బంది షకీల్, రబ్బాని, సైదులు, శ్రీకాంత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.