calender_icon.png 25 August, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించాలని తాసిల్దార్ కు వినతి

25-08-2025 07:40:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో జిల్లాలోని మొత్తం 18 మండలాల తాసిల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు  నిర్వహించారు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య మాట్లాడుతూ, సమాజంలో ప్రజల సమస్యలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు 24 గంటలూ శ్రమిస్తూ ప్రజాసేవలో ఉన్నప్పటికీ, తమకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ సహకారం అందకపోవడం వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాలి.