4 May, 2026 | 3:51 AM

అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

04-05-2026 02:39 AM

తాడ్వాయి,మే,3( విజయ క్రాంతి ): అగ్ని ప్రమాద బాధితులకు అడ్వకేట్ అండగా నిలిచారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పల్లె గడ్డ తండా కు చెందిన బాధితులకు ఆదివారం ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇటీవల పల్లె గడ్డ తండా, సామదుబ్బ తండాల లో జరిగిన అగ్రి ప్రమాదం లో నివాసపు గుడిసెలు కాలిపోయాయి.

సంబంధిత బాధితులు అయిన బానోత్ శంకర్, అంగోత్ సంతోష్, నునావత్ గణేష్ కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. అనంతరం బియ్యం,నిత్యా వసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు తన వంతు సాయం అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం నర్సారెడ్డి, గణేష్, సుమన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నవీన్,ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.