21-11-2025 03:16:10 PM
లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో మత్స్యశాఖ అధికారి విగ్నేష్ చేప పిల్లలను పంపిణీ చేశారు. శుక్రవారం లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మండలంలోని ఏడు మత్స్య సహకార సంఘాల సొసైటీల పరిధిలోని 29 కుంటలకు చేప పిల్లలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 29 చెరువులకుగాను 90 లక్షల 20 వేల చేప పిల్లల పంపిణీ చేశామని, అదే విధంగా మంచిర్యాల జిల్లాలో నాలుగో తేదీన ప్రతిష్టాత్మకంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ఇంకా 60 నుంచి 70 లక్షల వరకు చేప పిల్ల పంపిణీ మత్స్యకార సహకార సంఘాల సొసైటీలకు అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకార సహకార సొసైటీ సంఘాలు వినియోగించుకొని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఎ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరీప్, మాజీ ఫ్లో లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు నలిమెళి రాజు, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్, సత్తన్న, గోపె చిన్న రమేష్, వెంకటేష్, మత్స్యకార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.