ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
18-04-2026 01:35 AM
ఎమ్మెల్యే సునీత రెడ్డి
వెల్దుర్తి, ఏప్రిల్ 17: వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహాల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 43 మంది అర్హులైన లబ్ధిదారులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వయంగా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు స్వంత గృహం కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






