24 March, 2026 | 8:04 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

24-03-2026 06:30 PM

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పాపన్నపేట: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పొడ్చన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్ లో ఆయా గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు.