calender_icon.png 22 January, 2026 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ చీరల అందజేత

22-01-2026 05:24:27 PM

ఖానాపూర్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.గురువారం స్థానిక అంగన్వాడి పాఠశాల వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం ఈ చీరలు అందజేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని మైనార్టీ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా అన్నారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు, అమేర్ డ్వాక్రా గ్రూప్ మహిళలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.