22-01-2026 05:23:01 PM
తెరుచుకున్న శ్రీ వీరభద్రేశ్వర స్వామి దుకాణ సముదాయం..
కోర్టుకెళ్తాం.. వీర శైవ మాజీ యువ దల్ అధ్యక్షులు పటేల్ ప్రవీణ్ కుమార్.
తాండూరు, 22 జనవరి, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శ్రీ వీరభద్రేశ్వర స్వామి వ్యాపార సముదాయంలో ఉన్న దుకాణాలు గురువారం తెరుచుకున్నాయి . అయితే ఈ దుకాణ సముదాయం చట్ట విరుద్ధంగా నిర్మించారని వీరశైవ మాజీ యువ దళ్ అధ్యక్షులు పటేల్ ప్రవీణ్ కుమార్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఈ మేరకు కోర్టు జనవరి 31 తేదీ వరకు దుకాణ సముదాయాన్ని మూసి ఉంచాలని కోర్టు ఆదేశించి స్టే విధించింది. కాగా కోర్టు ఆదేశాలను ధిక్కరించి దుకాణాలను తెరవడం పట్ల ప్రవీణ్ కుమార్ తప్పు పట్టారు. ఈ విషయమై ఆయన మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు .సంబంధిత అధికారులను బాధ్యులుగా చేస్తూ న్యాయం చేయాలని మరోసారి కోర్టుకు వెళ్తానని తెలిపారు .