calender_icon.png 22 November, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

22-11-2025 02:01:17 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

చిట్యాల,(విజయక్రాంతి):  గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర  ప్రభుత్వం పనిచేస్తుందని అని నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham) అన్నారు. శనివారం రామన్నపేట మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుందని అని అన్నారు. వెల్లంకి గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు ను, సిరిపురం గ్రామంలో 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపనను, 15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం భోగారం గ్రామంలో 5లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనను, నీర్నేముల గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పాక్స్ చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.