calender_icon.png 22 November, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేసిన వీరేశం గుప్తా

22-11-2025 01:53:24 PM

శామీర్ పేట్: పారిశుధ్య కార్మికులు ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా కర్తవ్యమే పరమావధిగా నిత్యం  పనిచేస్తుంటారని లాక్ష్మపూర్ కాంగ్రెస్ నాయకులు వీరేశం గుప్తా అన్నారు. శనివారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మపూర్ లో పారిశుధ్య కార్మికులకు  సొంత డబ్బులతో  స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... పారిశుధ్య కార్మికులు ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా కర్తవ్యమే పరమావధిగా నిత్యం రహదారులు, వీధులను శుభ్రపరచటంలో నిమగ్నమవుతుంటారు. తెల్లవారుజామునే రహదారుల వెంట చెత్తను శుభ్రం చేసే వారి పని ఎవరికి పెద్దగా కనిపించకపోవచ్చు.కానీ, ఒకపూట  పారిశుధ్య సేవలు నిలిస్తే మాత్రం పరిస్థితి కడు దుర్భరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపి , పాండు, ఇతరులు గ్రామస్థులు పాల్గొన్నారు.