calender_icon.png 31 December, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

31-12-2025 09:34:25 PM

అన్న సాగర్ కళ్యాణి గ్రామంలో పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ లు స్రవంతి, నవ్య

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం, నూతనంగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ సర్పంచ్ లు, అన్నా సాగర్ గ్రామ సర్పంచ్ స్రవంతి, కళ్యాణి,గ్రామ పంచాయతీ సర్పంచ్ నవ్య లు, గ్రామంలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం గ్రామంలోని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులకు నేరుగా నూతన సర్పంచులు స్వహస్తాలతో అందజేశారు. అనంతరం అన్నాసాగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్రవంతి, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్మోహన్ అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నారని ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో సర్పంచిగా పదవి బాధ్యతలు చేపట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని ఆమె కొనియాడారు. 

కళ్యాణి గ్రామ సర్పంచ్ నవ్య మాట్లాడుతూ యువతకు గ్రామస్తులు ప్రాధాన్యం ఇచ్చారని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నా వెనుక ఎమ్మెల్యే మదన్మోహన్ ఉన్నారని ఆయన కృషి వల్ల గ్రామాన్ని అభివృద్ధి చెందే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామంలోని యువకులు గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని తనతో, పాటు గ్రామస్తులు కూడా అభివృద్ధికై నడుము కడితే మన గ్రామం ముందుకు సాగుతుందని, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజమని ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఆమె వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్ఐ శ్రీనివాస్, అన్న సాగర్ జిపిఓ సావిత్రి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అన్న సాగర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ నాగరాజు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.