calender_icon.png 31 December, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సరంలో విజయాలు సాధించాలి

31-12-2025 09:20:08 PM

చిట్యాల,(విజయక్రాంతి): 2026 నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సంబురాలు జరుపుకుంటున్న విద్యార్థులు ఈ సంవత్సరంలో విజయాలు సాధించాలని నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల వ్యవహకర్త పెద్ది నరేందర్ అన్నారు. బుధవారం పాఠశాలలో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర సంబరాలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పదవ తరగతి విద్యార్థులు మార్చిలో జరిగే వార్షిక పరీక్షలలో ఉత్తమమైన మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కేకులను కట్ చేశారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల సిబ్బంది పెద్ది పద్మ, నమ్ముల ఆనందకుమార్, షేక్ షమీం, స్వాతి, ఎస్ జ్యోతి, రమాదేవి, ధనలక్ష్మి, జుబేదా, మాధవి, మౌనిక, కీర్తి, సంపూర్ణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.