calender_icon.png 31 December, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్టీయూతోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం

31-12-2025 09:22:51 PM

నంగునూరు: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఓగులం రాజిరెడ్డి అన్నారు. బుధవారం నంగునూరు మండలంలోని వివిధ పాఠశాలల్లో పర్యటించిన ఆయన, నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులు ప్రస్తుతం పొందుతున్న సౌకర్యాలన్నీ సంఘం పోరాటాల వల్లే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.

అనంతరం మండల అధ్యక్షుడు ఎర్ర పార్థసారథి మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండేళ్లు గడుస్తున్నా వేతన సవరణ,హెల్త్ కార్డులు, డీఏ బకాయిల వంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేశిరెడ్డి, సంఘం నాయకులు ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.