calender_icon.png 31 December, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్గొండ కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న అంతర్గత కుమ్ములాట

31-12-2025 09:04:49 PM

- డిసిసి అధ్యక్షుడు పున్న కైలాసనేతకు ఘోర అవమానం

- స్టేజ్ పై మంత్రి ఉన్నాడు మీరు పైకి వెళ్లొద్దని పోలీసుల ఆంక్షలు

- అవమానాన్ని రాష్ట్రమంతా చూస్తాదని వెనుదిరిగిన కైలాస్ నేత

చండూరు,(విజయక్రాంతి): ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన డిసిసి అధ్యక్షుడు పున్నం కైలాస్ నేతకు ఘోర అవమానం ఎదురయ్యింది.చండూరులో టీవీ జర్నలిస్ట్  తండ్రి సంతాప సభకు  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కైలాష్ నేత హాజరయ్యారు. రిపోర్టర్ తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించేందుకు మంత్రితోపాటు గుత్తా సుఖేందర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి తదితర నేతలు వేదిక పైకి వెళ్లారు.

ఆ క్రమంలోని వారితోపాటు వెళ్తున్న డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేతను స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర నిరాశకు గురై అవమానంతో వెనుతిరిగి నన్ను అడ్డగించి తప్పిదం చేశారు అంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు.రాష్ట్ర మొత్తం చూస్తుంది నాకు అవమానించారన్నారు. ప్రైవేట్ కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయనను వేదికపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు.

నాయకులను అందరినీ పంపించి ఆయనను మాత్రమే అడ్డుకోవడం ఆ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొనడంతో ఇది కుట్రగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమం కానప్పటికీ ఎందుకు నన్ను మాత్రమే పక్కకు తోసేస్తున్నారని ప్రశ్నించినా.. సమాధానం చెప్పకుండా పోలీస్ అధికారులు కొంత ఘాటుగా వ్యవహరించినట్లు తెలిసింది. పున్న కైలాస నేతను సీఐ అడ్డుకోవడం వెనక మంత్రి హస్తం ఉన్నట్లు అక్కడ చర్చ జరిగింది.

అదే లేకపోతే ప్రైవేట్ కార్యక్రమంలో అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. పున్న కైలాస్ నేతకు జిల్లా అధ్యక్ష పదవి వచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అవమాన పరుస్తున్నట్టు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ ఫంక్షన్లో సొంత పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడిని ఇంత ఘోరంగా అవమానించి,తనపై కావాలనే జరుగుతున్న కుట్రలో పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించారని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.