calender_icon.png 31 December, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

31-12-2025 09:25:57 PM

నంగునూరు: మండల పరిధిలోని మగ్ధుంపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగాs నిర్వహించారు. విద్యార్థులు '2026' ఆకారంలో నిలబడి చేసిన వ్యాయామ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు గత ఏడాది లోపాలను సరిదిద్దుకుని, స్పష్టమైన లక్ష్యాలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. లక్ష్మారెడ్డి, జె. సురేందర్ రెడ్డి, బి. సత్తయ్య, డి. గోవర్ధన్, ఎం. రాజయ్య, టి. రాజు తదితరులు పాల్గొన్నారు.