అంగన్వాడి టీచర్లకు మొబైల్స్ పంపిణీ
దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం మొబైల్ ఫోన్లను ఉచితంగా అందిస్తున్న నేపథ్యంలో 134 మంది టీచర్లకు ఆయన చేతుల మీదుగా మొబైల్ ఫోన్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమానికి అంగన్వాడి సేవలు ఎంతో కీలకమని, వారికి సాంకేతిక సదుపాయాలు అందించడం ద్వారా అంగన్వాడి టీచర్లు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని, డిజిటల్ సేవల వినియోగంతో లబ్ధిదారులకు వేగవంతమైన సేవలు అందుతాయన్నారు.
అనంతరం దమ్మపేట గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడి నిర్మాణం పూర్తి అయిన 25 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు కలిగి ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి శ్రీనివాస్, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవిరాంబాబు, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, నియోజకవర్గ హౌసింగ్ పరిశీలకులు జి.రాము, ఐసిడిఎస్ అధికారులు, హౌసింగ్ అధికారులు, ఉప సర్పంచ్, వివిధ వార్డుల మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు, కక్కిరాల రమేష్, రావు గంగాధర్ రావు, టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు, చిన్నశెట్టి యుగంధర్, కందుల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






