20 April, 2026 | 7:57 PM

పతేపూర్ లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

20-04-2026 06:52 PM

కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని పతేపూర్ గ్రామంలో సోమవారం లింగాయత్ లు అందరూ కలిసి బసవేశ్వరునికి పూజలు నిర్వహించి ఘనంగా బసవేశ్వర జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా నాగప్ప మాట్లాడుతూ... బసవేశ్వరుడు 12 శతాబ్దంలో గొప్ప సంఘసంస్కర్తగా పేరు పొందాలని ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని నాగప్ప పేర్కొన్నారు. సోమవారం పతేపూర్ గ్రామంలో లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.