03-06-2025 04:26:20 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(MLA Thanneeru Harish Rao) జన్మదిన వేడుకల సందర్భంగా మహబూబాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ కంకర్బోర్డ్ కాలని పేద ముస్లిం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అనంతరం పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేద విద్యార్థుల దీవెనలే హరీష్ అన్నకు సంతృప్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ నాయకుడు గూగులోతు సూర్య ప్రకాష్, ఇంచార్జి ప్రిన్సిపాల్ ఏం ఎన్ స్వామీ, రిఫీక్ ,యాసిన్, సాజిద్, జాకీర్, జమ్మూ, యాకుబ్, అల్తాఫ్, దుగ్గి భూపతి, అవారి సంతోష్, దేషబోయిన శ్రీనివాస్, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.