18 April, 2026 | 3:52 PM

Breaking News

శిఖరచక్ర శోభాయాత్ర

03-06-2025 04:20 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈనెల 5న నిర్వహించనున్న శిఖర చక్ర ప్రతిష్ట, కుంబాభిషేకం కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం శిఖర శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు శిఖర చక్ర శోభాయాత్ర లో పాల్గొన్నారు.