calender_icon.png 15 September, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలేరు పట్టణ మున్నూరుకాపు సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

15-09-2025 12:00:00 AM

ఆలేరు, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) :  యాదాద్రి భువన జిల్లా ఆలేరు పట్టణ మున్నూరు కాపు సంఘం ఎన్నికలు కొలనుపాక రోడ్డులోని మున్నూరు కాపు భవనంలో ఈరోజు జరిగాయి. గౌరవాధ్యక్షులుగా పోరెడ్డి శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా చిరిగే శ్రీనివాస్, ఏలగల స్వామి, పగడాల రాంబాబు, తోట మల్లయ్య, తోట నారాయణ, ఎలుగల పాపయ్య, ఏలుగల కుమారస్వామి, పంతం కృష్ణ, అధ్యక్షులుగా ఏలుగల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఏలుగల వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఎలుగల శివుడు,కందుల యాదగిరి, గాండ్ల రమేష్,జుల శ్రీధర్, కార్యదర్శులు ఎలుగల మహేందర్, ఏలగల భూపాల్, పూల మహేందర్, లక్కకుల ఉప్పలయ్య, సహాయ కార్యదర్శిగా ఎలుగల బాలరాజ్, సోమిశెట్టి మహేందర్, పోరెడ్డి ప్రసాద్ ఎలుగల శివ, కోశాధికారిగా పత్తి రాములు సహకోశాధికారిగా ఎలుగల కృష్ణమూర్తి, ప్రచార కార్యదర్శిగా భాశెట్టి రమేష్, కార్యవర్గ సభ్యులుగా గుడారపు శ్రీనివాస్ తోటరాము, సుంకరి రఘు, పూల హనుమంతు, పగడాల బాలకుమార్, తోట భాస్కర్, ఎలగల నరేందర్, ఎలగల జగన్, మణికొండ బాలరాజ్, అల్లం భుజ లింగం, ఎలగల చంద్రమౌళి  లు ఎన్నకయ్యారు. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షునికి, కార్యవర్గానికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మాజీ అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్ కి కూడా సంఘసభ్యులు సత్కారం చేయడం జరిగింది.