04-12-2025 07:31:05 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): భరత్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కీర్తిశేషులు నరహరి భరత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని గురువారం రోజున కొత్తపెల్లి మండలంలోని మల్కాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోట్ బుక్ పండ్లు, అన్ని తరగతుల విద్యార్థులకు వితరణ చేసినారు. ఈ కార్యక్రమంలో నరహరి లక్ష్మారెడ్డి, రాళ్ల బండి శంకర్, ప్రసాద్ రెడ్డి, బొంగోని పరశురాములు, ప్రధానోపాధ్యాయులు భీమేష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, విజయలక్ష్మి ,హాజీ పాషా, అల్లాద్దీన్ ,అనిత, రజిని ,స్వాతి ,ఓం ప్రకాష్ మరియు రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు.