04-12-2025 07:44:00 PM
పాపన్నపేట (విజయక్రాంతి): దేశంలోనే రెండో వన దుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే పల్లకి సేవ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఆలయ పరిసరాలు హోరెత్తాయి. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.