04-12-2025 08:08:48 PM
జిల్లా విద్యాశాఖ అధికారి రాజు..
కామారెడ్డి (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. వేస్ట్ టు వెల్త్ – వ్యర్థాల్లోనూ విలువ ఉంటుందన్నారు. రోజువారీ జీవితంలో ఉత్పత్తి అయ్యే చెత్తను సక్రమంగా వర్గీకరించి పునర్వినియోగం చేస్తే అది సంపదగా మారుతుందని అన్నారు. ఎన్ జి ఓ ఆధ్వర్యంలో వేస్ట్ వెల్త్ 20 25 ఎగ్జిబిషన్ కామారెడ్డి సిఎస్ఐ హైస్కూల్లో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ నుండి 35 పాఠశాలల నుండి 200 పైగా విద్యార్థిని విద్యార్థులు, వారి గైడ్ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ వో రాజు మాట్లాడుతూ ప్లాస్టిక్, కాగితం, లోహం వంటి పొడి వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపడం ద్వారా ఆదాయం పొందుతున్నారు.
వంటింటి తడిచెత్తను కంపోస్ట్‌గా మార్చి వ్యవసాయం, తోటలలో ఉపయోగిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పాత బాటిల్స్‌తో పెన్‌స్ట్యాండ్లు, టిన్ డబ్బాలతో ప్లాంట్ పొట్టులు, పేపర్‌తో ఆర్ట్ మోడల్స్ తయారు చేసి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆదాయం అందించే ఈ “వేస్ట్ టు వెల్త్” చర్యకు ప్రతి ఇంటి, ప్రతి స్కూలు, ప్రతి గ్రామం పాలుపంచుకుంటే శుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవితానికి దారి తెరుచుకుంటుందని తెలిపారు.
ప్లాస్టిక్, కాగితం, లోహం వంటి పొడి వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. వంటింటి తడిచెత్తను కంపోస్ట్‌గా మార్చి వ్యవసాయం, తోటలలో ఉపయోగిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పాత బాటిల్స్‌తో పెన్‌స్ట్యాండ్లు, టిన్ డబ్బాలతో ప్లాంట్ పొట్టులు, పేపర్‌తో ఆర్ట్ మోడల్స్ తయారు చేసి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆదాయం అందించే ఈ “వేస్ట్ టు వెల్త్” చర్యకు ప్రతి ఇంటి, ప్రతి స్కూలు, ప్రతి గ్రామం పాలుపంచుకుంటే శుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవితానికి దారి తెరుచుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామరెడ్డి, జిల్లా ఎన్జీసి కోఆర్డినేటర్ విద్యాసాగర్, ఐటి హబ్ శ్రీకాంత్, సైన్స్ ప్రతినిధులు కృష్ణారావు, సురేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.