04-12-2025 07:33:07 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): పొనుగోడు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. పార్టీ స్థాపన నాటి నుండి నిబద్ధతతో పనిచేస్తూ, సొంత ఖర్చులతో పార్టీ అభివృద్ధికి కృషి చేసిన తనను, ఇటీవలి కాలంలో కొందరు నేతల ఒంటెద్దు పోకడల నిర్ణయాలు తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేశాయని పేర్కొన్నారు. ఆ నిర్ణయాల వల్ల పార్టీ బలం దెబ్బతింటున్నా,సమన్వయం చేసి సరిచేసే నాయకత్వం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పుకుంటున్నట్లు జోగు అరవిందరెడ్డి ప్రకటించారు.