04-12-2025 07:42:27 PM
అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు
శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్ఐ లు సైదులు, రవీందర్
నకిరేకల్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని శాలిగౌరారం కట్టంగూరు ఎస్ఐలు సైదులు, రవీందర్ అన్నారు. మండల పరిధిలోని పలు సమస్యాత్మక గ్రామాలను పోలీస్ విభాగం గుర్తించింది.గురువారం మండలం లోని భైరవునిబండ, ఎన్జీ కొత్తపల్లి తదితర గ్రామాల్లో శాలిగౌరారం, కట్టంగూర్ ఎస్ ఐ లు సైదులు, రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 11న జరిగే గ్రామ పంచాయతీ పోలింగ్ రోజు ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో డబ్బులకు మధ్యానికి లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఎవరైనా అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కవాతులో శాలిగౌరారం, కట్టంగూర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.