04-12-2025 07:40:35 PM
మేడిపల్లి (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయం నందు డిప్యూటీ కమిషనర్ శైలజ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతిని పురస్కరించుకొని గురువారం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో అసిస్టెంట్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, మేనేజర్ ప్రవీణ్ కుమార్, ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, వార్డ్ ఆఫీసర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.