04-12-2025 08:06:17 PM
కొల్చారం (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా తాను సర్పంచ్ బరిలో ఉంటున్నానని అప్పజిపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గజినీ వెంకట్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన నాయిని గజినీ వెంకట్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, పెద్దఎత్తున మహిళలతో మేళ తాళాలతో ట్రాక్టర్లో తరలివచ్చారు. స్థానిక బస్టాండ్ నుంచి నామినేషన్ కేంద్రం వరకు భాజా భజంత్రీలతో జై కాంగ్రెస్ నినాదాలు ఇస్తూ వెళ్లారు.
ఈ సందర్భంగా అప్పజిపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి నాయుని గజిని వెంకట్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నాయిని సునీత వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషా ఖాదిరి, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వీరేశం, చలం రాములు, షేకులు, లారీ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్, చింత కింద రమేష్, కుమార్, నర్సింలు, శేఖర్ శేఖర్, మహిళా నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు.