7 July, 2026 | 2:08 AM

కాళేశ్వరం కట్టింది, కూల్చిందీ వాళ్లే!

07-07-2026 12:00 AM

పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం: మంత్రులు పొంగులేటి, వివేక్

గజ్వేల్, జూలై 6: గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుందని, అదే ప్రాజెక్టును కూల్చిన పరిస్థితికి కూడా తీసుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్మిక  శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి ఇందిరమ్మ ఇళ్లతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. గత పదేళ్లలో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని, ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం ఆ కలను నిజం చేస్తోందని చెప్పారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మం జూరు చేస్తున్నామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్త అనే భేదం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్లను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి బటన్ నొక్కి నేరుగా నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. దాదాపు రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగంగా కొనసాగుతున్నా యని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అన్ని వసతులతో లబ్ధిదారులకు అందిస్తున్నామని వెల్ల డించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరినట్లుగా మొండి గోడలతో నిలిచిపోయిన ఇళ్లకు కూడా ఆర్థిక సహాయం అందిం చే అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.