7 July, 2026 | 2:22 AM

అంగన్‌వాడీలోకి వర్షపు నీరు

07-07-2026 12:00 AM

భయాందోళనలు విద్యార్థులు 

చేగుంట, జూలై 6:  పట్టణ కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం- 3 వర్షపు నీటితో జలమయమైంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కేంద్రంలోని ఆవరణలో పెద్ద ఎత్తున, వరద నీరు నిలిచిపోయింది. దీనితో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

దీనిపై అంగన్వాడీ టీచర్ సుగుణని వివరణ కోరగా.. కేంద్రం ఆవరణ నీరు నిలిచిపోవడంతో చిన్న పిల్లలు పాఠశాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు, గురిఅవుతూ, భయపడుతున్నారని, ఈ నీటిని చూసి తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలకు పంపించడానికి పెనుకంజ వేస్తున్నారని అన్నారు. ఈ సమస్యపై ఇప్పటికే సర్పంచ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వరద నీటిని తొలగించి, నల్లా కనెక్షన్ను పునరుద్ధరించాలని వారు కోరారు.