28-10-2025 12:14:48 AM
వేలేరుపాడుకు బస్సు సౌకర్యం
ప్రజలతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వరావుపేట, అక్టోబర్ 27,(విజయక్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ము న్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకి పనిముట్లు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అందజేశారు. అనంతరం బస్ స్టాండ్ లో వేలేరుపాడు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన. బస్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగాఎమ్మెల్యే ఆది నారాయణ మాట్లాడుతూగ్రామీణాభివృద్ధిలో ఉపాధి హామీ కార్మికుల పాత్ర అపారమైనది అని అన్నారు.
వారికి అవసరమైన పనిముట్లు అందించడం ద్వారా వారి పనిలో వేగం, నాణ్యత పెరుగుతుందని ,ప్రభుత్వం ఎప్పుడూ శ్రామికుల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని అన్నారు.కార్మికులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేయగా, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరంఅశ్వారావుపేట నారాయణపురం, పెద్దవాగు ప్రాజెక్ట్, గుమ్మడవెల్లి, కొత్తూరు ప్రజల సౌకర్యార్థం. వేలేరుపాడు కు బస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే జా రే ఆదినారాయణ స్వయంగా బస్సుకు జెండా ఊపి అశ్వారావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు కొ వేల్లేరుపాడు వరకు బస్సులోఎమ్మెల్యే జారే అది నారాయణ పర్యటించారు.
ప్రజా రవాణా సదుపాయాన్నీ వినియోగించుకోవాలని కోరారు.ప్రజలకు సౌకర్యాలు కల్పించడం నా కర్తవ్యం. రవాణా సదుపాయం లేని గ్రామాలకు రోడ్డు మార్గం ద్వారా చేరుకునే అవకాశం కల్పించడమే మా లక్ష్యం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.కొత్త బస్సు సర్వీస్ ప్రారంభించడం తో అశ్వారావుపేట, నారాయణపురం, గుమ్మడివల్లి అంతరాష్ట్ర సరిహద్దు వెళ్లేరుపాడు ప్రాంతాల ప్రజల్లో ఆనందం నెలకొంది. గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మండల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.