28-10-2025 12:15:14 AM
కోదాడ, అక్టోబర్ 27: యాసంగి బోన స్ డబ్బులు రైతులకి తక్షణమే వేసి ఖరీఫ్ వడ్లను తీసుకోవాలని రామలక్ష్మి పురం బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెం అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని యాసంగి వడ్లకు ఇంతవరకు వేయలేదని దీనికి ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు.
ఖరీఫ్ పంట కొనుగోలు కంటే ముందే యాసంగి బోనస్ రైతులకు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు సన్న రకం దాన్యం వేయడం వలన పెట్టుబడి పెరిగిందని అన్నారు. తక్షణమే యాసంగి బోనస్ వేసి రైతుల ను ఆదుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దిగుబడి కూడా తగ్గిందని, అధికారు లు ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు పంట నష్టపరిహారం కూడా అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.