calender_icon.png 4 December, 2024 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాకీ క్రీడల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు..

08-11-2024 11:20:05 AM

అండర్ 17 రాష్ట్రస్థాయి లో ప్రథమ బహుమతి..

ఆదిలాబాద్, (విజయక్రాంతి): అండర్ 17 హాకీ టోర్నమెంట్ లో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించి ఆదిలాబాద్ జిల్లా లో హాకీ క్రీడా కు పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 17 హాకీ టోర్నమెంట్ లో జిల్లా క్రీడాకారులు ప్రథమ బహుమతి సాధించి జిల్లాకు వచ్చిన సందర్భంగా రైల్వే స్టేషన్ లో వారికి శుక్రవారం ఘనంగా స్వాగతం పలికి, రాష్ట్రస్థాయి హాకీ క్రీడలో ప్రథమ బహుమతి సాధించిన క్రీడాకారులను అభినందించారు.

ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించేలా లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. చాలా కాలం తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ప్రథమ స్థానం రావడం సంతోషంగా ఉందన్నారు. కప్ సాధించిన జట్టులో నలుగురికి జాతీయస్థాయిలో అవకాశం రావడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో జాతీయస్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, కోచ్ లు శ్రీను, శేఖర్, రవి ఉన్నారు.