calender_icon.png 24 June, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో..

23-06-2025 12:00:00 AM

జిల్లాలో వైద్యసేవలో సమూల మార్పులు

మెదక్, జూన్ 22(విజయక్రాంతి): అల్లాదుర్గం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహం, కేజీబీవీ పాఠశాల మరమ్మతు పనులను ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టికలు, ఓపి రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఆకస్మిక పర్యటనతో వైద్య సేవలో సమూల మార్పులు సంతరించుకున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

సమయపాలన పాటించి నాణ్యమైన వైద్యశాల అందిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం కస్తూర్బా గాంధీ విద్యాలయం పరిశీలించారు. మరమ్మత్తులకు సంబంధించి వివరా లను అడిగి తెలుసుకున్నారు మెరుగైన సౌకర్యాలు సదుపాయాలతో ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ప్రభుత్వం  తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. 

ఎస్సీ హాస్టల్ ను పరిశీలించి హాస్టల్ లోని నిత్యావసర సరుకులను, స్టోర్ రూంను ఆహార పదార్థాలు, వంట గదులు, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశీలించారు. అన్ని సంక్షేమ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,హాస్టల్ నిర్వాహకులు, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు.