11-12-2025 04:27:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో గురువారం జరుగుతున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా, పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పెంబి మండలంలోని ధూమధారి, గుమ్మేణ గ్రామాల్లో, ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి, తర్లపాడ్, గోసంపల్లి, దిలావర్ పూర్ గ్రామాలతో పాటుగా, మమడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలకులు తనిఖీ చేశారు. ఎన్నికల సరళిని పరిశీలించి, పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.