01-12-2025 08:34:08 PM
శ్రీపాద మార్గ్, జాతీయ రహదారి భూ సేకరణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెండింగ్ భూసేకరణ పనులు వారం రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్, సమీకృత జిల్లా కలెక్టరేట్ లో శ్రీపాద ఎస్.డి.ఆర్, జాతీయ రహదారి భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచిర్యాల-వరంగల్ 4 లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవే, మంథనిలోని శ్రీపాద ఎస్.డి.ఆర్ నిర్మాణానికి పెండింగ్ భూ సేకరణ పనులు వారం రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శ్రీపాద ఎస్.డి.ఆర్. నిర్మాణం సంబంధించి భూ సర్వె పనులు పూర్తి కావాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ రహదారి అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.