01-12-2025 08:47:24 PM
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు..
రెబ్బెన (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరవేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు. రెబ్బెన మండల కేంద్రంలోని బిఆర్ఎస్ మాజీ వార్డ్ సభ్యురాలు బొడ్డు యశోదతో పాటు పలువురు సోమవారం పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి కొలిపాక కిరణ్ కుమార్. అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మీ. మండల అధ్యక్షుడు మల్రాజు రాంబాబు. గోలెం తిరుపతి. మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్. రెబ్బెన సర్పంచ్ అభ్యర్థి బొడ్డు మౌనిక తదితరులు పాల్గొన్నారు.