calender_icon.png 1 December, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

01-12-2025 08:18:21 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..

మోతె: ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రంను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి టి. ఆంజనేయులు, తహసీల్దార్ యం. వెంకన్నలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యంపిడిఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మామిళ్ళ గూడెం నామినేషన్ కేంద్రంను పరిశీలన చేశారు.

మండలంలోని పలు క్లస్టర్ లలో నామినేషన్లపై వివరాలు అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు నింపే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి విషయంలో అధికారులు సమయస్ఫూర్తితో ఉండాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.