01-12-2025 08:54:37 PM
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
రచ్చపల్లిలో ప్రభుత్వ పాఠశాల తనిఖీలో పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా..
మంథని (విజయక్రాంతి): ప్రతి ఓటరు భయభ్రాంతులు లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొవాలని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు, రచ్చపల్లి గ్రామాల లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా, పోలింగ్ రోజు ఎలాంటి అక్రమాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ అన్ని భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, చట్టవ్యతిరేక చర్యలు ఎవరు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. స్థానిక ప్రజలకు, అన్ని పార్టీల కార్యకర్తలకు శాంతి భద్రతలు, చట్టపరమైన నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, మంథని సిఐ బి రాజు, మంథని ఎస్ ఐ రమేష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.