calender_icon.png 1 December, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజు 55 స‌ర్పంచుల నామినేష‌న్లు

01-12-2025 08:51:40 PM

మునిపల్లి (విజయక్రాంతి): మండలంలోని 30 గ్రామ పంచాయతీలో గాను సర్పంచ్ స్థానాలకు 55 మంది, 262 వార్డులకు గాను 219 మంది నామినేషన్లు రెండో రోజు సోమ‌వారం దాఖలు చేశారు. కాగా ఆదివారం 17 మంది స‌ర్పంచులు అభ్య‌ర్థులు, 23 వార్డు స‌భ్యుల‌కు నామినేష‌న్లు దాఖలు కాగా సోమ‌వారం నాటికి మొత్తం స‌ర్పంచు స్థానాల‌కు 72, వార్డుల‌కు మొత్తం 242 మంది అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ ల‌ను దాఖ‌లు చేసుకున్నారు.

ఇందులో భాగంగానే మండ‌లంలోని ఆయా గ్రామాల‌కు చెందిన అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్లు వేసేందుకు ఆయా క్ల‌స్ల‌ర్ల వ‌ద్ద రైతు వేదికల వ‌ద్ద‌కు చేరుకొని త‌మ నామినేష‌న్లను దాఖ‌లు చేశారు. మండ‌లంలోని బుసారెడ్డిప‌ల్లి  గ్రామ స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా మంతూరి స్వ‌ప్ప శ‌శికుమార్ వేసిన నామినేష‌న్ ప‌త్రాల‌ను చూయిస్తున్న దృశ్యం, అలాగే చిన్న‌చెల్మెడ గ్రామ స‌ర్పంచ్ అభ్య‌ర్థి రుద్ర క్రిష్ణ పెద్దచెల్మెడ రైతు వేదికలో త‌మ నామినేష‌న్ ను దాఖ‌లు చేశారు.